Header Banner

సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. మరో 21 రన్స్‌ చేస్తే.. అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను న‌మోదు!

  Tue Feb 04, 2025 17:13        Sports

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన ఓ ఆల్ టైమ్ రికార్డుపై టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ క‌న్నేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి ర‌న్ మెషీన్‌కి కేవ‌లం 94 పరుగులు కావాలి. ఈ నెల 6 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో ఆడనున్న కోహ్లీ ఆ రికార్డును అందుకునే అవ‌కాశం ఉంది. ఇంత‌కీ ఆ రికార్డు ఏంటంటే.. అత్యంత వేగంగా 14 వేల‌ వన్డే పరుగుల మైలురాయి. ఈ ఫీట్‌ను న‌మోదు చేయ‌డానికి స‌చిన్ 350 ఇన్నింగ్స్ లు ఆడాడు. అదే కోహ్లీ విషయానికొస్తే... ప్ర‌స్తుతం 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటు, 93.54 స్ట్రైక్ రేట్‌తో 13,906 పరుగులు చేశాడు.

 

ఇంకా చదవండి: ఓరీ దేవుడా.. ఒకే అబ్బాయితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో.. రోడ్డుపై విద్యార్థినుల ఫైట్!

 

రాబోయే మూడు మ్యాచ్ ల సిరీస్ లో మ‌రో 94 ర‌న్స్ చేస్తే... అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లీ అవ‌త‌రిస్తాడు. కాగా, 2006 ఫిబ్రవరిలో పెషావర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో టెండూల్కర్ తన 350వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో అతను సెంచరీ కూడా చేశాడు. కానీ, భారత్ 7 పరుగుల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి) మ్యాచ్‌లో ఓడిపోయింది. మరోవైపు కోహ్లీ వ‌న్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు బాదిన విష‌యం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచ కప్ లో కోహ్లీ 50 ఓవ‌ర్ల‌ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట‌ర్‌గా స‌చిన్‌ (49)ను అధిగమించాడు. ఇక వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ (463 వన్డేల్లో) 18,426 పరుగులతో అగ్ర‌స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.


ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రియురాలి కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ MLA కొడుకు.. ఎంతకి తెగించాడురా.. అందరూ షాక్!

 

సుమ బండారం బయటపెట్టిన యూట్యూబర్.. గంట షూటింగ్‌కొస్తే.. సోషల్ మీడియాలో వైరల్!

 

త్వరలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి.. నిర్మాత ఆసక్తికర కామెంట్స్!

 

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై కీలక అప్‌డేట్! బ్యాంకర్లతో సీఎం కీలక భేటీ!

 

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ViratKohli #SachinTendulkar #TeamIndia #Cricket #SportsNews